మీకు ఇష్టమైన శాస్త్రవేత్త ఎవరో  అడిగితే…. సాధారణ సమాధానం ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేదా ఇస్సాక్ న్యూటన్ లేదా నికోలా టెస్లా కావచ్చు.కానీ చాలామంది మన భారతీయ శాస్త్రవేత్త జే .సి.చంద్రబోస్‌ను మరచిపోయారు.రేడియోను మార్కోనీ కనుగొన్నారుకానీ అంతకు ముందు భారతదేశంలో రేడియో తరంగాల ప్రస్తావన  ఉంది. రేడియో తరంగాల గురించి మాత్రమే కాదు, ఈ ఆధునిక రోజుల్లో 5జి  సాధ్యం చేసిన మిల్లీమీటర్ తరంగాలు కూడా.ఈ ప్రయోగాలు ఆచార్య జగదీష్ చంద్రబోస్ గారి  చేత నిర్వహించబడ్డాయి.వైర్‌లెస్ కమ్యూనికేషన్ పితామహుడిగా బిరుదాంకితుడు .

ఇప్పుడు 19 వ శతాబ్దానికి తిరిగి వెళ్దాంజే సి బోస్ బెంగాలీ మీడియంలో చదువుకున్నారు . అతని మెడికల్ డిగ్రీ కోసం లండన్ కు  పంపబడ్డారు.కానీ తరువాత అతను మెడిసిన్ వదిలి ఫిజిక్స్ ఎంచుకున్నారు.విద్య తరువాత అతను భారతదేశానికి తిరిగి వచ్చారు ,

భారతీయ విద్యార్థులకు ఫిజిక్స్ నేర్పించేవారు,అది కూడా నెలకు వంద రూపాయలకు

ఆ రోజుల్లో భారతదేశం  బ్రిటిష్ కాలనీల్లో ఒకటి. ప్రయోగాలకు నిధులు లభించేవి కాదు  మరియు చిన్న ప్రయోగశాలలలో ప్రయోగాలు నిర్వహించేవారు. ఈ  పరిస్థితులలో పనిచేసిన తరువాత కూడా అతని ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి.జే సి బోస్ 1890 లలో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు మార్గదర్శకుడు.రేడియో మరియు రిమోట్ కంట్రోల్, వైఫై మరియు ఈ తరం 5జీ కి అయన ఆవిష్కరణలు మూల కారణం.రేడియో తరంగాలను కనిపెట్టిన మొదటి వ్యక్తి  జే. సి బోస్, ఇది మార్కోని  కనుక్కున్న రేడియో ఆవిష్కరణకు ఆధారం.కానీ ఎప్పుడూ క్రెడిట్ కోసం క్లెయిమ్ చేయలేదు.అతను తన ఆవిష్కరణలను బలంగా  నమ్ముతూ కొనసాగేవారు.అతను భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు, పర్యావరణ ప్రేమికుడు కూడా.చెట్లు, మొక్కలు కూడా మనలాగే భావోద్వేగాలను అనుభవిస్తాయని ఆయన కనుగొన్నారు.అతను మొక్కలతో ప్రేమగా మాట్లాడేవారు.మొక్కల పెరుగుదలను చూపించే పరికరాన్ని ఆయన కనుగొన్నారు.చెట్లు, వాటి మూలాల ద్వారా ఇతర మొక్కలతో సంభాషిస్తాయని అతను కనుగొన్నారు.

ఈ రోజు మనం వినియోగిస్తున్న రేడియో తరంగాలను కనిపెట్టిన వ్యక్తి మన భారతదేశ శాస్త్రవేత్త అని  గర్వంగా చెప్పుకోగలం.ఈ ప్రపంచం మరిచినా మన భారతదేశ పౌరులం ఆయనని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళదాం.

0 CommentsClose Comments

Leave a comment

Newsletter Subscribe

Get the Latest Posts & Articles in Your Email

We Promise Not to Send Spam:)